సుజుకి కొత్త జనరేషన్ ఆల్టోను జపాన్‌లో ప్రదర్శించింది. ఇది తొమ్మిదో జనరేషన్ మోడల్. త్వరలో దీనికి సంబంధించిన సేల్ కూడా అక్కడ జరగనుంది. జపాన్‌లో అందుబాటులో ఉన్న ఆల్టో కారు, మనదేశంలో అందుబాటులో ఉన్న ఆల్టో కారు రెండు వేర్వేరుగా ఉంటాయి. జపాన్‌లో లాంచ్ అయిన సుజుకి ఆల్టో డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంది. కొత్త ఆల్టోలో ముందు వెర్షన్ కంటే మంచి ఇంటీరియర్‌ను అందించారు. ఈ కారు వెనకభాగాన్ని కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. మారుతి సుజుకి కొత్త ఆల్టో కారును రూపొందిస్తుంది. ఈ మోడల్ మనదేశంలో వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జపాన్‌లో ఉన్న కొత్త ఆల్టోలో బాక్స్ తరహా డిజైన్ ఉన్నప్పటికీ.. ముందు వెర్షన్ కంటే చాలా కొత్తగా ఉంది. కొత్త తరహా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, క్రోమ్ ఇన్‌సర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.