ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.1316 వద్ద ఆరంభం అయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ.690తో పోలిస్తే 90 శాతం ప్రీమియంతో నమోదన్నమాట.
బీఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ.1341 వద్ద గరిష్ఠాన్ని తాకి రూ.1144 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి రూ.1252 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో గో కలర్స్ ఇంట్రాడే గరిష్ఠమైన రూ.1339ని తాకింది. ఒకానొక సమయంలో రూ.1143 వద్ద కనిష్ఠాన్ని అందుకొని చివరికి 81శాతం ఎక్కువగా రూ.1253 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈ లెక్కల ప్రకారం.. గో కలర్స్ ఒక లాట్(21)కు తొలిరోజు భారీ లాభాలను పంచిపెట్టింది.
సాధారణంగా ఒక లాట్‌కు పెట్టుబడి మొత్తం రూ.14,490. ఇంట్రాడే గరిష్ఠమైన రూ.1341 వద్ద విక్రయిస్తే రూ.28,161 చేతికి అందేవి.
కనిష్ఠమైన రూ.1144 అమ్మిఉంటే రూ.24,024 వచ్చేవి.
ఇక ముగింపు ధర రూ.1252 వద్ద అమ్మేస్తే రూ.26,292 చేతికి అందేవి.
గో కలర్స్ బ్రాండ్‌కు మార్కెట్లు మంచి పేరుంది! విమెన్ బాటమ్‌వేర్‌లో వివిధ రకాల అప్పారెల్స్‌ను విక్రయిస్తోంది. రిటైల్, ఈ-టైల్, ఆన్‌లైన్‌లో దుస్తులను విక్రయిస్తోంది.