జీవిత భాగస్వామిపై నమ్మకం పోయిందా? ఇలా చేయండి...



ఏ బంధమైనా నిలబడేది నమ్మకం పైనే. ముఖ్యంగా వివాహ బంధం.



భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయినప్పుడు ఆ ఇల్లు నరకంలా మారుతుంది.



బంధం నిలబెట్టుకునేందుకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవే.



మీ భర్త లేదా భార్యకు తిరిగి నమ్మకాన్ని సంపాదించుకునే పనులు చేయమని సలహా ఇవ్వండి. అయితే ఆ నమ్మకం మీకు కలగడానికి సమయం చాలా పడుతుంది. మీరు కూడా సహనంగా వేచి ఉండాలి.



మీ జీవిత భాగస్వామి తప్పు చేసినప్పుడు వారిని నిలదీయండి. కానీ అరుపులు, కేకలతో కాదు. మీ భావోద్వేగానలు అదుపులో ఉంచుకుని ప్రశాంత వాతావరణంలోనే వారిని నిలదీయండి.



చాలా మంది జీవితభాగస్వామిపై నమ్మకం కోల్పోయిన సంఘటన ఎదురైనప్పుడు మాట్లాడడం మానేస్తారు. కానీ అది సరైనది కాదు. మాట్లాడండి... మీరు ఏమనుకుంటున్నారో అన్నీ చెప్పండి. చివరికి వారికే నిర్ణయాన్ని వదిలేయండి.



మీ భర్త లేదా భార్యతో కమ్యూనికేట్ చేయలేనప్పుడు ఇద్దరికీ ఆప్తులైన వ్యక్తి సాయం తీసుకోవచ్చు. మీ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి కచ్చితంగా మంచి దిశానిర్దేశం చేయవచ్చు.



మిమ్మల్ని మోసం చేసిన జీవితభాగస్వామి తప్పు తెలుసుకుని నిజాయితీగా ఉంటానని చెబితే... వారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అలాగని గుడ్డిగా నమ్మేయద్దు.



వివాహబంధంలో అనుమానాలు, సందేహాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి.



చివరకు ఏ మార్గం లేనప్పుడే బంధానికి స్వస్తి పలికే ఆలోచనలకు దారివ్వండి.