స్టార్ హెల్త్ ఐపీవో 2021, నవంబర్ 30న మొదలై డిసెంబర్ 2న ముగుస్తుంది. డిసెంబర్ 7న షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఆ మరుసటి రోజే షేర్లు కేటాయించని వారి డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. 10న స్టాక్‌మార్కెట్లో నమోదు అవుతుందని అంచనా.
ఇవి గమనించండి
దేశంలో బీమా రంగం వృద్ధి చెందుతోంది. విదేశాల్లో బీమా రంగం వాటా జీడీపీలో 2 శాతం ఉంటే భారత్‌లో 0.3 శాతమే. మున్ముందు ఇది పెరిగే అవకాశం ఉంది.
స్టార్‌హెల్త్ 2006లో మొదలైంది. 2021 ఆర్థిక ఏడాదికి మార్కెట్లో 15 శాతం సాధించింది. ఈ కంపెనీ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. 2021లో 2 కోట్ల మందిని బీమా పరిధిలోకి తీసుకొచ్చింది.
వ్యక్తిగత బీమా ఏజెంట్ల ద్వారానే 80 శాతం బిజినెస్ జరుగుతోంది. కనీసం 5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఇంకా ఆన్‌లైన్, బ్రోకర్లు, వెబ్ అగ్రిగేటర్ల ద్వారా బీమాలు అమ్ముతోంది.
2021లో కంపెనీ GWP రూ.9,348 కోట్లుగా ఉంది. ఆ తర్వాత ఉన్న HDFC Ergoతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. రిటైల్ బిజినెస్ ప్రీమియం ఏటా 31శాతం వృద్ధి చెందుతోంది.
బీమా రంగం వృద్ధి చెందుతున్నా కొవిడ్ వంటి ఉపద్రవాలతో చాలా కంపెనీలు నష్టాలు నమోదు చేశాయి. కరోనా వల్ల చివరి 18 నెలల్లో స్టార్‌హెల్త్ రూ.3,300 కోట్లకు పైగా క్లెయిమ్స్ రూపంలో చెల్లించింది.
2020లో రూ.6,891 కోట్ల ప్రీమియం సేకరించగా రూ.268కోట్ల లాభం నమోదు చేసింది. కొవిడ్ వల్ల 2021లో రూ.9,349 కోట్ల ప్రీమియం వచ్చినా రూ.826 కోట్ల నష్టం నమోదు చేసింది.
స్టార్‌హెల్త్ 17 రిటైల్ ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. పోటీదారులతో పోలిస్తే ఎక్కువే. చాలామంది ఏజెంట్లు ఉండటంతో స్టార్‌హెల్త్‌ను ఎక్కువగా వారే ప్రమోట్ చేస్తున్నారు.
FY 18-20లో క్లెయిమ్ రేషియో 65 శాతంగా ఉంది. ఎప్పుడైతే 2021లో కరోనా మహమ్మారి ప్రవేశించిందో ఈ రేషియో 94 శాతానికి చేరుకుంది.
బీమా రంగం వృద్ధి చెందుతుంటం లాభమైతే, మొత్తంగా రిటైల్ ప్రొడక్టుల ద్వారా బిజినెస్ జరుగుతోంది కాబట్టి మార్కెట్లో సమస్యలు ఎదురైతే కష్టమయ్యే అవకాశం ఉంది.