దేశ రక్షణలో త్రివిధ దళాల పాత్ర చాలా కీలకం.

సైన్యం, నౌకాదళం, వాయుసేన ఈ మూడు దళాలు దేశ రక్షణలో నిమగ్నమై ఉంటాయి.

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ త్రివిధ దళాలు చేసే సాయం ఎనలేనిది.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రక్షణ దళాల్లో భారత్ ఒకటి. త్రివిధ దళాధిపతులు గురించి తెలుసుకుందాం

భారత నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు.

39 ఏళ్ల తన సర్వీసులో నేవిగేషన్, డైరెక్షన్లో మంచి నైపుణ్యం ఉన్న అధికారిగా పేరొందారు.

భారత సైన్యాధిపతిగా ఉన్న జనరల్ ఎమ్ ఎమ్ నరవాణేకు ఎంతో అనుభవం ఉంది.

చైనాతో సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ ఆయన అనుభవం భారత్‌కు కలిసొచ్చింది.

భారత వాయుసేన అధిపతిగా వివేక్ ఆర్ చౌదరి ఉన్నారు.

ఆయనను ప్రభుత్వం ఇప్పటికీ పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, వాయుసేన పతకాలతో సన్మానించింది.

ఐఎన్‌ఎస్ కోరా, ఐఎన్‌ఎస్ రణవీర్, ఐఎన్ఎస్ విరాట్ సహా పలు యుద్ధనౌకలను నడిపిన అనుభవం హరి కుమార్‌కు ఉంది.