రెండు నెలల క్రితం యూఎస్ లో మొదటి సారి గుర్తించిన కొత్త వేరియెంట్ JN.1. కోవిడ్ ఇక మీదట మెడికల్ ఎమర్జెన్పీ కాదు. కానీ జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ లో కూడా దాదాపుగా ఇది వరకు అన్ని కోవిడ్ వేరియంట్ లోని లక్షణాలే ఉంటాయి. ఈ కొత్త వేరియెంట్ సోకినపుడు కూడా జ్వరం, దగ్గు, శ్వాసలోపం, అలసట, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలన్నీ గమనించారు. ఇది ప్రమాదకరం కాదు. కానీ అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన దీని సంబంధించిన పరిశోధనలు ఇంకా సాగుతూన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియెంట్ త్వరగా వ్యాపిస్తుంది కనుక జాగ్రత్తలు అవసరం అంటున్నారు. మాస్క్ లు ధరించడం, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. Representational Image : Pexels