డయాబెటిస్ తో బాధపడుతున్న వారు పండ్లు తినొచ్చా? తింటే ఏవి తినాలి? వంటి అనుమానాలు ఉంటాయి.

మధుమేహులు 150-200 గ్రాముల పండ్లను తీసుకోవాలని నిపుణుల సూచన.

ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి, పుచ్చకాయలు మధుమేహులకు మంచిది.

వీటిలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి.

ఫోలెట్, విటమిన్ సి, పొటాషియం, డైటరీ పైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

ఈ పండ్లు బీపి అదుపులో పెట్టేందుకు దోహదం చేస్తాయి.

జామ, సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

బి కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్యంగా ఫోలెట్ సిట్రస్ పండ్లు, ఆపిల్, పుచ్చకాయ, బొప్పాయిలో ఎక్కువ.

పండ్ల రసాలు కాకుండా పూర్తి పండు తినడం మంచిది. పండులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం బావుంటుంది.

Representational Image : Pexels