నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

జూన్ 9న మహాబలిపురం ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు.

పెళ్లి తర్వాత నయన్-విఘ్నేష్ ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేశారు.

ఈ కొత్త జంట థాయ్‌లాండ్‌లో కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు.

బ్యాంకాక్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో మధురక్షణాలను గడిపారు.

మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్న ఈ జంట తాజాగా స్పెయిన్ వెళ్లారు.

సరిహద్దులు దాటి.. ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.

తమ రొమాంటిక్ ఫొటోలను విఘ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నయన్ ఇంకా ఇప్పటికీ పెళ్లి రోజు కట్టిన తాళినే మెడలో ఉంచుకుంది.

దీంతో నయన్‌ను అంతా మంగళసూత్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు.

Credits: Vignesh Shivan/Instagram