మన రాములమ్మ.. శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ‘పటాస్’తో బోలెడంత వినోదాన్ని పంచింది శ్రీముఖి. ప్రస్తుతం జీ తెలుగులో ‘స రె గ మ పా’లో యాంకరింగ్ చేస్తోంది. శ్రీముఖి ఇప్పుడు పెళ్లి సందట్లో మునిగితేలుతోంది. ప్రస్తుతం శ్రీముఖి జైపూర్లోని ఓ పెళ్లికి హాజరైంది. ఈ సందర్భంగా శ్రీముఖి రోజుకో ఫొటోను పోస్ట్ చేస్తోంది. సంగీత్ కార్యక్రమం కోసం బ్లాక్ డ్రెస్లో ముస్తాబైంది శ్రీముఖి. శ్రీముఖి.. మెహందీ కార్యక్రమం ఫొటో, వీడియోలు కూడా పోస్ట్ చేసింది. మెహందీ పెట్టుకుంటున్నా కానీ, వరుడు మాత్రం దొరకడంలేదని శ్రీముఖి పేర్కొంది. డోన్ట్ వర్రీ శ్రీముఖి, నీకు కూడా వరుడు దొరుకుతాడని అభిమానులు అంటున్నారు. Images Credit: Sreemukhi/Instagram