అదితి శంకర్ సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. కార్తీ నటిస్తోన్న 'విరుమాన్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఓకే అనిపించింది అదితి శంకర్. రీసెంట్ గా ఈ బ్యూటీ మరో సినిమా ఒప్పుకుంది. కోలీవుడ్ హీరో కార్తికేయన్ రీసెంట్ గా బైలింగ్యువల్ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఆ సినిమాకి 'మావీరన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో 'మహావీరుడు' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదితి శంకర్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో అదితి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతుందన్నమాట. రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.