లవ్లీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? స్పెయిన్‌లో! పెళ్ళి తర్వాత నయనతార వేసిన సెకండ్ ఫారిన్ ట్రిప్ ఇది! ఇందులోనూ మెడలో మంగళ సూత్రంతో కనిపిస్తున్నారు. పెళ్ళి తర్వాత థాయ్‌లాండ్‌కు హనీమూన్ ట్రిప్ వేశారు నయన్ - విఘ్నేష్. థాయ్‌లాండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ముంబైలో షారుఖ్ ఖాన్ సినిమా షూటింగులో నయన్ పాల్గొన్నారు. ఇప్పుడు షూటింగుల నుంచి కాస్త తీరిక దొరకడంతో స్పెయిన్ టూర్ వేశారు. ఇది రెండో హనీమూన్ అనుకోవచ్చు ఏమో!? స్పెయిన్‌లోని బార్సిలోనాలో బస్సులో షికారు చేస్తున్న నయనతార స్పెయిన్‌లోని బార్సిలోనాలో బస్సులో షికారు చేస్తున్న విఘ్నేష్ శివన్. స్పెయిన్ జర్నీలో... నయనతార - విఘ్నేష్ శివన్. శ్రీమతి చేతికి ఆప్యాయంగా ముద్దు పెడుతున్న శ్రీవారు. విమానంలో నయనతార, విఘ్నేష్ శివన్ సెల్ఫీ మూమెంట్