అందాల తార నయనతార 39వ వసంతంలోకి అడుపెట్టింది. 18 నవంబర్, 1988లో కేరళలో నయన్ జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు డయానా మరియం కురియన్ గా నామకరణం చేశారు. సినిమా పరిశ్రమలోకి వచ్చాక తన పేరును నయనతారగా మార్చుకుంది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో చివరగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ సినిమాలో కనిపించింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది. శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచింది. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లై 5 నెలలు గడవక ముందే సరోగసీ ద్వారా ట్విన్స్ ను కని విమర్శలకు గురయ్యింది. Photos Credit: Nayanatara/twitter