'ఇస్మార్ట్ శంకర్'తో కన్నడ భామ నభా నటేష్ తెలుగులో భారీ హిట్ అందుకున్నారు. ఫుల్ పాపులారిటీ వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' కంటే ముందు 'నన్ను దోచుకుందువటే', 'అదుగో' సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత కూడా నభా నటేష్‌కు ఆ స్థాయి విజయం రాలేదు. 'డిస్కో రాజా' నుంచి 'మేస్ట్రో' వరకు నభా నటేష్ చేసిన సినిమాలు అన్నీ మటాష్ అయిపోయాయి. అందం, అభినయంలో నభా నటేష్ తెలుగు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. నభా నటేష్ చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు అసలు రావడం లేదు. 'మేస్ట్రో' తర్వాత నభా నటేష్‌కు తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం నభా నటేష్ పరిస్థితి ఏంటో మరి? సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫోటోలతో సందడి చేస్తున్నారు. త్వరలో నభా నటేష్ తెలుగు సినిమా చేయాలని, విజయం అందుకోవాలని ఆశిద్దాం.