మహిళలూ పుట్టగొడుగులూ తినాల్సిందే

పుట్టగొడుగులు అనగానే దాన్ని సాధారణ ఆహారంగా చూడరు ఎంతో మంది.వాటిని ప్రత్యేకంగా అప్పుడప్పుడే తింటారు.

మహిళలు తరచూ పుట్టగొడుగులు తినమని చెబుతోంది కొత్త పరిశోధన.

పుట్టగొడుగులు అనగానే దాన్ని సాధారణ ఆహారంగా చూడరు ఎంతో మంది.

వీటిల్లో ఉండే ఎర్గోథియోనీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుంది.

మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను ఇది అడ్డుకుంటుంది.

పోషకాహారలోపముతో బాధపడుతున్నవారికి వీటితో వండిన ఆహారాన్ని పెడితే కొన్ని రోజుల్లోనే ఆ లోపం పోతుంది.

అధిక రక్తపోటు కలవారు వీటిని తింటే మంచిది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు కూడా మేలే.

డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి సందేహం లేకుండా వీటిని తినవచ్చు.

వీటిలో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. మహిళలు వీటిని తింటే రక్తహీనత సమస్య కూడా పోతుంది.