శరీరంలో పది వాయువులన్నాయని తెలుసా



గాలి పీల్చుకోవడం, వదలడం అనుకుంటారు కానీ మన శరీరంలో పదిరకాల వాయువులు ఉంటాయని తెలుసా... ఒక్కో వాయువుకి ఒక్కో పని.. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ప్రాణం గాల్లో కలసిపోవాల్సిందే...



ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండేది ప్రాణవాయువే. ప్రాణవాయువు ఎంతవిలువైనదో కరోనా సమయంలో అందరికీ తెలిసొచ్చింది.



అపానవాయువు
తిన్న ఆహారం విసర్జించేందుకు ఉపయోగపడేదే అపాన వాయువు. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. ఇలా తయారైన గ్యాస్ మొత్తం ఎలాగోలా బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మానవ శరీరం సహజంగా పీల్చేసుకుంటుంది. అపానవాయువును ఆపుకోకూడదు.



వ్యానము
శరీరం వంగడానికి కారణమయ్యేది వ్యానము. శరీరం సంకోచ, వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు ఇది. అంటే ఎక్సర సైజ్ చేసేందుకు శరీరం సహకరించేలా చేసే వాయువు ఇది.



ఉదాన వాయువు
ఉదాన వాయువు సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాం. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగుతాయి.



సమాన వాయువు
జీర్ణం అయిన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానంగా ప్రసరించేలా చేస్తుంది సమాన వాయువు.



నాగము
జీర్ణాశయంలో అధిక వాయువు ఉండకుండా సహాయం చేసేది నాగము. అందరకీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే త్రేణుపు. కడుపునిండా తిన్నప్పుడు, హెవీగా అనిపించినప్పుడు ఈ వాయువు గొంతు ద్వారా బయటకు వస్తుంది.



కూర్మము
కళ్లుమూసి తెరిచేందుకు కూడా గాలి అవసరం ఉంటుందని మీకు తెలుసా. కళ్లు మూసి తెరిచే సమయంలో అవసరమయ్యే గాలిని కూర్మము అంటారు.



కృకరము
తుమ్మే సమయంలో వచ్చే గాలి కృకరము.



దేవదత్తము
ఇంద్రియములు పనిచేసేందుకు సహకరించేది దేవదత్తము. ఇదే ఆవులింత.



ధనుంజయము
శరీరంలో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉండే వాయువు ధనుంజయము. సాధారణంగా మనిషి మృతిచెందిన తర్వాత కూడా కొన్ని గంటల పాటూ గుండె పనిచేస్తుంది.అది ధనుంజయ వాయువు వల్లనే.