మునక్కాయలు - నాలుగు చింతపండు - 50 గ్రాములు ఎండు మిర్చి - 8 కరివేపాకులు - రెండు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు - పది మిపప్పప్పు - రెండు స్పూనులు శెనగ పప్పు - రెండు స్పూనులు
మెంతులు - అర టీస్పూను ఆవాలు - మూడు టీస్పూనులు పసుపు - ఒక టీస్పూను ఉప్పు - రుచికి సరిపడా కారం - మూడు స్పూనులు ఇంగువ - పావు టీస్పూను నూనె - ఎనిమిది టీస్పూనులు
మునక్కాడలు కోసుకుని కడిగి తడి ఆరబెట్టుకోవాలి.
ఆవాలు, మెంతులు వేయించి మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నూనెలో మునక్కాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
కళాయిలో మిగిలిన నూనెలో మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఎండు మిరపకాయలు, పసుపు, ఇంగువ, చింతపండు గుజ్జు వేసి వేయించాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో మునక్కాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు మిశ్రమం వేసి కలపాలి.
మొత్తం మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి మూత పెట్టాలి.
నూనె తక్కువగా అనిపిస్తే వేడి చేసి మరికొంచెం వేసుకోవచ్చు.