ఈ ఏడాది చాలా కంపెనీలు మల్టీ బ్యాగర్లుగా అవతరించాయి! ఇన్వెస్టర్ల డబ్బులను రెట్టింపు చేశాయి. సంపదను మరింత వృద్ధి చేశాయి.



గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ లిమిటెడ్‌ (GFL) స్టాక్ అలాంటిదే.



కేవలం 12 నెలల్లోనే ఈ షేరు ధర 300 శాతం ర్యాలీ చేసింది. ఏడాదిలోనే రూ.590 నుంచి రూ.2,539కి చేరుకుంది.



ఏడాది క్రితం ఈ షేరులో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.21.5 లక్షలు చేతికి వచ్చేవి.



రూ.27,000 కోట్ల మార్కెట్‌ విలువ గల ఈ కంపెనీ షేరు ధర 5, 20, 50, 100, 200 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌కు పైనే చలిస్తోంది.



ఇంతలా ఎగిసినా రూ.3,086 టార్గెట్‌ పెట్టుకొని పెట్టుబడి పెట్టొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ చెబుతోంది.



2021, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీఎఫ్‌ఎల్‌ రూ.207 కోట్ల నికర లాభం నమోదు చేసింది.



గతేడాది ఇదే సమయంలో ఇది రూ.79 కోట్లే కావడం గమనార్హం.



ఆపరేషన్స్ రాబడి 56 శాతం పెరిగి రూ.964 కోట్లకు చేరుకుంది.



ఈపీఎస్‌ రూ.7.21 నుంచి రూ.18.66కు పెరిగింది. చివరి మూడు త్రైమాసికాల్లోనూ పాజిటివ్‌ రిజల్టునే నమోదు చేసింది.