గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటిన తీవ్ర తుపాను మాండస్ శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనం వాయవ్య దిశగా పయనించి డిసెంబరు 10 ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మార్పు నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు తుపాను ప్రభావం తెలంగాణపై చాలా స్వల్పంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 16 డిగ్రీలు తూర్పు దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం