ఫోన్‌ బ్రైట్‌నెస్ ఎప్పుడూ ఫుల్‌గా ఉంచడం వల్ల బ్యాటరీ వేగంగా డ్రైన్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pixabay

యాప్స్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల ప్రాసెసర్ పని చేస్తూనే ఉంటుంది, ఫలితంగా బ్యాటరీ ఖర్చవుతుంది.

Image Source: pixabay

ఫోన్ వాడటం ఆపేసిన తర్వాత కూడా స్క్రీన్ చాలా సేపు వెలుగుతూనే ఉంటే బ్యాటరీ వృథా అవుతుంది.

Image Source: pixabay

జీపీఎస్ ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ పర్సంటేజ్ వేగంగా పడిపోతుంది.

Image Source: pixabay

వై-ఫై, బ్లూటూత్ నిరంతరం సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటాయి. దీనివల్ల కూడా బ్యాటరీ ఖర్చవుతుంది.

Image Source: pixabay

అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీని ఆదా చేయవచ్చు.

Image Source: pixabay

సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు, ఫోన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.

Image Source: pixabay

ఈమెయిల్స్, ఫోటోలు నిరంతరం క్లౌడ్‌లోకి అప్‌లోడ్ ( అవుతూ ఉండటం వల్ల ఇంటర్నెట్, బ్యాటరీ రెండు ఖర్చవుతాయి.

Image Source: pixabay

కదిలే వాల్‌పేపర్లు, హోమ్ స్క్రీన్‌పై ఉండే వాతావరణం, వార్తల విడ్జెట్లు బ్యాటరీని లాగేస్తాయి.

Image Source: pixabay

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోయినా లేదా ఏదైనా బగ్ ఉన్నా బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది.

Image Source: pixabay