మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్ ఈ టీమ్‌ఇండియా దిగ్గజం నేటితో విరామం ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 ఆడింది. వరుసగా 699, 7805, 2364 పరుగులు చేసింది. అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక వనిత. 19 ఏళ్ల 254 రోజులప్పుడు డబుల్ సెంచరీ కొట్టేసింది. వన్డే క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడిన ఏకైక క్రికెటర్ మిథాలీ. 22 ఏళ్ల 274 రోజులు ఆడింది. అత్యధిక వన్డే మ్యాచులకు కెప్టెన్సీ చేసిందీ మిథాలీయే. 155 వన్డేలకు నాయకత్వం వహించింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డూ మిథాలీదే. 7805 రన్స్ చేసింది. వన్డే క్రికెట్లో ఎక్కువ సార్లు 90ల వద్ద ఔటైన క్రికెటర్ మిథాలీ. ఐదుసార్లు అయింది. మహిళల వన్డేల్లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్ మిథాలీ రాజ్.