బనానా కప్ కేక్స్, మైదా అవసరమే లేదు



మైదా వాడకుండా కప్ కేక్స్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.



అరటి పండ్లు - మూడు
గోధుమ పిండి - కప్పున్నర
పంచదార - పావు కప్పు
బేకింగ్ పౌడర్ - ఒక స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - ఒక స్పూను
ఉప్పు - చిటికెడు

బాగా పండిన అరటిపండ్లను గిన్నెలో వేసి బాగా గుజ్జుగా చేతులతో నలిపేయాలి.



ఆ గుజ్జులో చక్కెర , నిమ్మరసం, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ కూడా వేసి బాగా కలపాలి.



గోధుమపిండి,ఉప్పు వేసి ఉండల్లేకుండా ఆ మిశ్రమంలో వేయాలి.



కేకులు మెత్తగా రావాలి కనుక బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలపాలి.



మిశ్రమం మరీ మందంగా అనిపిస్తే కాస్త పాలు కలుపుకోవచ్చు.



ఇప్పుడు కప్‌కేక్ ట్రేలో కాస్త వెన్న రాసి ఈ పిండిని వేయాలి.



మైక్రో ఓవెన్‌ను పదినిమిషాలు ఉంచితే కేకులు రెడీ అవుతాయి.