యాంకర్ రవి ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్నాడు. తన ఫ్యామిలీతో కలిసి అక్కడ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల రవి తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. టైమ్స్ స్క్వేర్ వద్ద తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. యాంకర్ రవి బుల్లితెరకు పరిచయమై 13 ఏళ్లు అవుతోంది. రవికి 2013లోనే పెళ్లయ్యింది. 2015లో కూతురు వియా పుట్టింది. 2017లో రవి ‘ఇది మా ప్రేమకథ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, హిట్ దక్కలేదు. ‘బిగ్ బాస్’ సీజన్-4లో కూడా రవికి లక్ కలిసి రాలేదు. 84వ రోజే ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేటయ్యాడు. ఇటీవల రవి ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ బజ్‌తో ఆకట్టుకున్నాడు. Images Credit: Anchor Ravi/Instagram