దీపం ఇలా పెడితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది



సంపాదన లేక కొందరు బాధపడితే...సంపాదించింది నిలవక మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొందరైతే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు.



ఇందుకు ప్రయత్న లోపం ఒకటైతే, కొన్నిసార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం మరింత బాధ. ఇలాంటి వారికోసం ఐశ్వర్య దీపం కొంత ఉపశమనాన్ని ఇస్తుందంటారు పండితులు.



ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపుకుంకుమ రాయాలి. బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఒకటిగా పెట్టాలి



ప్రమిదల్లో పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద దానిపై పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించాలి.



పళ్ళు, పాలు, పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి, లక్ష్మీ దేవి, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది.



శుక్రవారం దీపారాధన చేశాక శనివారం ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి నీటిలో కలపి ఆ నీటిని ఇంటి బయట ఎవ్వరూ తొక్కని స్థలంలో పోయాలి. అవకాశం ఉంటే చెరువుల్లో, నదుల్లో కలపవచ్చు. ఏ అవకాశం లేకుంటే నీళ్లలో కలిపి షింక్ లో అయినా పోయొచ్చు.



వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పనిలేకుండా అవే వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పు తీసేయాలి.



11 శుక్రవారాలు కానీ 16 వారాలు కానీ, 21, 41వారాలు కానీ అనుకుని దీపం వెలిగించాలి. ఈశాన్యమూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. 41 శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టే వారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.



ఈ ఐశ్వర్య దీపం ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత ఉపశమనమే కానీ పూర్తిస్థాయి పరిష్కారం కాదంటారు పండితులు. ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు ఆధారంగా వీటిని అనుసరించవచ్చంటారు.



'దీపం' ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటూ మానసిక ప్రశాంతతని ఇస్తుందంటారు.



దీపం పెట్టే విధానం మారితే సంపద కూడా నిలబడుతుందంటారు పండితులు...
Images Credit: Pinterest