లేడీ సూపర్ స్టార్ నయన తార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకుంటున్నారు. తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించిన నయన్‌కు ఒకప్పుడు లవ్ కలిసిరాలేదు. శింబు, ప్రభుదేవలను ప్రేమించిన నయన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుదేవతో పెళ్లి కోసం నయన్ సినిమాలు వదులుకోడానికి కూడా సిద్ధమైంది. రెండు సార్లు హార్ట్ బ్రేకైన తర్వాత నయన్ ఇక ప్రేమకు దూరంగా ఉండాలని అనుకుంది. మళ్లీ సినిమాలతో బిజీగా మారి ఆ బాధను మరిచిపోవాలని అనుకుంది. అప్పుడే, విఘ్నేష్ శివన్ పరిచయమయ్యాడు. 2015లో ‘నేను రౌడీనే’ సినిమాతో విఘ్నేష్‌తో నయన్‌కు బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చినా ఖండించలేదు. విఘ్నేష్ నయన్ ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ రూమర్స్‌కు తెర దించాడు. 2021లో వీరిద్దరు నిరాడంబరంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది (2022) జూన్ 9న పెళ్లితో ఒక్కటి కానున్నారు. Images and Video Credit: Vignesh Shivan/Instagram