పాయల్ రాజ్‌పుత్ RX 100తో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అందాలను అవలీలగా ఆరబెట్టే పాయల్ దక్షిణాదిలో బిజీగా మారిపోయింది. ‘ఆహా’లో ‘3 రోజెస్’ వెబ్ సీరిస్‌తో ఇటీవల బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘కిరాతక’, మంచు విష్ణుతో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాల్లో నటిస్తోంది. పాయల్ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. పాయల్ తాజాగా బుల్లెట్ బండి పక్కన నిలుచున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ RX 100 వదిలి బుల్లెట్ బండెక్కేస్తావా అంటున్నారు. Images and Videos Credit: Payal Rajput/Instagram