మధుమేహుల కోసం జొన్న దోశె

జొన్న పిండి – మూడు క‌ప్పులు
అటుకులు – పావు క‌ప్పు
మిన‌ప ప‌ప్పు – ఒక క‌ప్పు
మెంతులు – ఒక టీ స్పూన్
నూనె – పావు క‌ప్పు
ఉప్పు – త‌గినంత‌

మినపప్పు, మెంతులు కలిపి ముందుగా నానబెట్టుకోవాలి. దాదాపు నాలుగ్గంటల పాటూ నానితేనే అవి మెత్తగా అవుతాయి.

అటుకులు కూడా వండడానికి ఒక అరగంట ముందు నానబెటితే చాలు.

అన్ని బాగా నానిన తరువాత మినపప్పు, మెంతులు, అటుకులు వేసి కాస్త ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ రుబ్బులో జొన్నపిండిని కూడా కలిపి కాస్త నీళ్లను పోసి బాగా కలపాలి.

అలా కలిపాక ఓ పది గంటల పాటూ పులియ బెట్టాలి. పులిసిన రుబ్బు మరింత ఆరోగ్యం.

గరిటెతో బాగా కలిపి పెనంపై దోశెల్లా పోసుకోవాలి. పల్చటి దోశెల్లా వేసుకుంటే రుచిగా ఉంటాయి.

ఈ దోశెలను కొబ్బరి చట్నీ, వేరుశెనగ పలుకుల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.