మేషం స్థిరాస్తి వ్యవహారాల్లో పుంజుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో మీకు వ్యతిరేకులు పెరుగుతారు. గృహ, సామాజిక పనుల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజంతా బిజీగా ఉంటారు.
వృషభం మీ పనిని మరొకరికి అప్పగించవద్దు. మీ నైపుణ్యంతో పనిని మరింత సులభతరం చేస్తారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఆహారం, యోగాపై శ్రద్ధ వహించండి. ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించుకుంటారు.
మిథునం ఈ రోజు స్నేహితుడు లేదా బంధువుల ఇంటికి వెళతారు. ఎవరితోనూ గొడవ పడకండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ ఆస్తులకు తగిన భద్రత ఏర్పాటు చేయండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
కర్కాటకం ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రంలోగా ఓ శుభవార్త వింటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. పనిపట్ల అలసత్వం వద్దు.
సింహం బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులను కలుస్తారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకోండి.
కన్యా దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ సంబంధాలను మూడుముళ్ల బంధంగా మార్చుకోవచ్చు. నిలిచిపోయిన పాత పనులు తిరిగి ప్రారంభించవచ్చు. ఆర్థిక విషయాల్లో లాభిస్తుంది.
తులా ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు.ఆఫీసులో పనిభారం అధికంగా ఉంటుంది. అధికారుల నుంచి తిట్ల దండంకం వినాల్సి రావొచ్చు. చేసిన పనే పదే పదే చేయాల్సి రావొచ్చు.మహిళలు తమ భద్రత విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
వృశ్చికం కుటుంబ కలహాల కారణంగా ఇబ్బందులు ఉంటాయి. ఏకాంతంలో ఉండటం చాలామంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు చాలా మంచిది. వివాదాస్పద విషయాల్లో మీరు విజయం సాధించగలరు. మీ ఖర్చులు తగ్గుతాయి.
ధనుస్సు కుటుంబ పనులపై బయటకు వెళ్లాల్సి రావొచ్చు. సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. మీరు చేసే పనులు మీకు చాలా ఆనందాన్నిస్తాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఆసక్తి ఉంటుంది.
మకరం ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది. మీ పనులు నిదానంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా చర్చలు వద్దు. ఇతర పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు. స్నేహితులతో చర్చిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు.
కుంభం వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితుడిని కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఎవ్వరికీ మాటివ్వకండి. ఆ కారణంగా మీరు చిక్కుల్లో చిక్కుకోవచ్చు.అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. ఎవరిపైనా ఆధారపడొద్దు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి.
మీనం మీరు కార్యాలయంలో శుభవార్త వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. న్యాయపరమైన వ్యవహారాలు సాగుతాయి. ఈ రోజు మంచి రోజు అవుతుంది. మిత్రులను కలుస్తారు.