గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవిగో...



హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

గుండె పోటు రావడానికి కొన్ని రోజుల ముందు ఎడమ చేతిలో నొప్పిగా ఉంటుంది. ఎడమ భుజం నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.

ఎడమ దవడలో కూడా అసౌకర్యంగా అనిపించడంతో పాటూ, నొప్పి మొదలవుతుంది.

శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఆయాసం తరచూ వస్తుంది.

శరీరం చల్లగా మారిపోతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.

ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది.

వికారంగా అనిపించడం, తలతిరగడం వంటివి కలుగుతాయి.

గుండెల మీద ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గుండెపోటు సంకేతాలే.

వీటిలో ఏ ఒక్కటి మీకు అనిపించినా వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లండి.