మిస్ వరల్డ్‌గా పోలాండ్ అందగత్తె మిస్ వరల్డ్ 2021 గా పోలాండ్ కు చెందిన కరోలినా బీలాస్కా గెలుచుకుంది. ఈ పోటీలు గతేడాది జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు. పోర్టోరికాలోని ఈ అందాల పోటీలు జరిగాయి. అమెరికాకు చెందిన భారతీయ సంతతి అమ్మాయి శ్రీషైనీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో కోట్ ది ఐవరీ దేశానికి చెందిన ఒలీవియా యేస్ నిలిచింది. భారత్ తరపున పాల్గొన్న మానసా వారణాసి ఒత్తిచేతుల్తోనే వెనుదిరగాల్సి వచ్చింది. కరోలినా అనాధల కోసం జూపా నా పియట్రినై అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. ఆమె అందమైన రూపమే కాదు మంచి మనసు కూడా అందాల కిరీటాన్ని దగ్గర చేసింది.