ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు. ఈ పండుగను ఐదు రోజులు ముందుగానే కాశీలో జరుపుకుంటారు.
దేశం నలుమూలలా రంగులతో, లేదా రంగు నీళ్లతో మరికొంత మంది పువ్వులతో హోలిని జరుపుకుంటారు. అయితే కాశీలో మాత్రం చితా బస్మంతో జరుపుకుంటారు.
కాశీలోని ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్ లో శవభస్మంతో హోళిని జరుపుకుంటారు. నాగ సాధువులు ఒకరి పై మరొకరు ఈ భస్మాన్ని చల్లు కుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు.
ఈ హోలీ సమయంలో నాగ సాధువులు పాన్, తో పాటు ఒక రకమైన మత్తును కలిగించే బంగ్ అనే పదార్థాన్ని తప్పక తీసుకుంటారు. వీటిని మహాదేవుని ప్రసాదంగా భావిస్తారు.
అప్పుడే దహనం చేసిన శవం భస్మాన్ని తీసుకుని ఒకరి పై ఒకరు చెల్లు కొంటూ ఈ వినూత్న హోలీని జరుపుకుంటారు.
ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి హోలీని చూడలేం
ఈ శవ భస్మ హోలీ చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.
హోలీ జరపుకోవడానికి ముందు నాగసాధువులు చితికి మంగళహారతి ఇస్తారు.