బుధుడి సంచారం మేష రాశివారికి అన్నీ శుభఫలితాలే ధనస్సు రాశిలో ఉన్న గ్రహాల యువరాజైన బుధుడు 2024 ఫిబ్రవరి 01న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 న మకరంలోకి ప్రవేశించి...ఫిబ్రవరి 18 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. మకర రాశిలోకి బుధుడు ప్రవేశించడం వలన మేష రాశి వారికి చాలా ఉపశమనం లభిస్తుంది. గడిచిన నెలలో పడిన బాధల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. ఉద్యోగులు ప్రతిభకు తగిన ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం బావుంటుంది. ప్రేమ బంధంలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి సమయం. Image Credit: Pinterest