'బిగ్ బాస్'తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న మెహబూబ్ దిల్ సే. ఆ తర్వాత బీబీ జోడీ ద్వారా పలు డ్యాన్స్ ఫర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఈ షోలో ప్రారంభంలో అషురెడ్డితో జత కట్టగా.. కొన్ని రోజులకు శ్రీ సత్యను జోడీగా చేర్చుకున్నాడు. ట్రెండ్ ను ఫాలో అవుతూ.. యూత్ కు దగ్గరగా ఉండేందుకు ఇష్టపడే యాక్టర్స్ లో మెహబూబ్ ఒకడు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన మెటా మీట్ అప్ హైదరాబాద్ లో పాల్గొన్న పలువురు సెలబ్రెటీలు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో మెహబూబ్ కూడా పార్టిసిపేట్ చేసి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. చేతిలో మెటా బ్యాగ్ తో ఫొటోకు ఫోజులిచ్చిన మెహబూబ్ దిల్ సే. మెహబూబ్.. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ తో పాపులార్ అయ్యాడు. Image Credits : Mehaboob Dilse/Instagram