48 ఏళ్ల వయసులో ఇప్పటికీ తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మొన్నామధ్య మలైకాకు యాక్సిడెంట్ జరిగింది. తిరిగి కోలుకొని నటిగా మళ్లీ బిజీ అయింది. పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంటుంది. ఇదిలా ఉండగా.. మలైకా ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.