శారీరక, మానసిక రుగ్మతలవల్ల చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.

అయితే నిద్రలేమి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు.

మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తాయి.

నిద్రలేమి వల్ల అమాంతం బరువు పెరిగిపోతూ ఉంటారు.

ఇది మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీసి.. త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది.

మెదడు పని తీరుపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అందుకే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.

సరైన నిద్ర ఉంటే చాలా ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. (Images Source : Unsplash)