మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మొదటి రోజు వసూళ్లలో దుమ్ము రేపింది.

ఫస్ట్ డే ఈ సినిమా రూ.80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.52 కోట్ల వరకు ఉంది.

‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.132 కోట్ల వరకు జరిగింది.

దీంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ఈ సినిమాకు టాక్ అంత ఆశాజనకంగా లేదు.

మరోవైపు ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’లతో పోటీ పడాల్సి ఉంటుంది.

ఇన్ని అడ్డంకుల మధ్య వసూళ్లు ఎలా సాధిస్తుందో చూడాలి.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘గుంటూరు కారం’ రూ.102 కోట్ల బిజినెస్ చేసింది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.