మహా శివరాత్రి 2023: సృష్టిలో ఫస్ట్ సైంటిస్ట్ శివుడే!



మహా శివరాత్రి ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18 శనివారం వచ్చింది. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేస్తారు భక్తులు.



కొత్తగా ఏదైనా కనిపెట్టిన వారిని ఆవిష్కర్తలు అని చెప్పుకుంటాం...ఇలా అయితే సృష్టిలో మొదటి ఆవిష్కర్త పరమేశ్వరుడే అని చెప్పాలి. సప్తస్వరాలు, నృత్యవిద్యలు, భావ వ్యక్తీకరణ ఇవన్నీ శివుడి ఆవిష్కరణలే అని తెలుసా



సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14 సూత్రాలు ఢమరుక నాదం నుంచి సృష్టించాడు శివుడు



వర్ణ సమ న్యాయం అందించిన శివుడికి కృతజ్ఞతగా అక్షరాభ్యాసం రోజు ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’అని మొదటగా రాయిస్తారు.



యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు



సంగీత విద్యకు మూలం సప్తస్వరాలు. అందులోని షడ్జమం(నెమలి) ,రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం) ,పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు), ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు



‘శివ తాండవం’ ద్వారా ‘నృత్యవిద్య’ను అందించాడు. దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు



పార్వతికి సగభాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో చెప్పాడు. సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు



శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు. గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు



అందుకే శివుడిని మించి ఆవిష్కర్తలు ఎవరని చెప్పగలం
Images Credit: Pinterest