త్రిమూర్తుల్లో లయకారుడు శివుడే ఎందుకయ్యాడు



బ్రహ్మ-సృష్టిధర్మానికి రక్షకుడు
విష్ణువు-సృష్టి పోషకుడు
శివుడు- లయకారుడు



లయం అంటే లీనం చేసుకోవడం, తనలో కలుపుకోవడం



మమకారం ఉన్నచోట స్వార్థం ఉంటుంది, స్వార్థం ఉన్నచోట లయానికి తావులేదు



వ్యామోహం లేనివాడు విరాగి.. విరాగి మాత్రమే సర్వాన్ని తనలో లీనం చేసుకోగలుగుతాడు



శివుడికి తన దేహంమీదే మమకారంలేదు...



శివుడు దేహానికి చితాభస్మాన్ని పూసుకుంటాడు-దిగంబరంగా తిరుగుతాడు..



భిక్షాటన చేస్తాడు, పుర్రెలో తింటాడు, రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు



శ్మశానంలో ఉంటాడు...ఇంతటి విరాగి కనుకే ఆయన లయకారకుడయ్యాడు



అంతా చివరకు చేరేది ఆరడుగుల భూమిలోకే



ఎంత గొప్ప వ్యక్తి అయినా కాలాక మిగిలేది బూడిదే



అందుకే సర్వం తనలో లీనం చేసుకునే...



శివుడి నివాసం శ్మశానం అయింది..ఆయనే లయకారుడయ్యాడు