పవన్ కల్యాణ్, రానా నటించిన సినిమా 'భీమ్లా నాయక్' శుక్రవారం(ఫిబ్రవరి, 25న) విడుదలైంది.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు ఇది రీమేక్.

ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చగా సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.

కథ: సబ్ ఇన్స్‌పెక్టర్ భీమ్లా నాయక్(వపన్), డానియల్(రానా)ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొస్తాడు.

కథ: స్టేషన్‌లో సీజ్ చేసిన లిక్కర్ బాటిల్ తీసి, డానీకి మందు పొసి చిక్కుల్లో పడతాడు. ఆ తర్వాత కథ అనేక ములుపులు తిరుగుతుంది.

విశ్లేషణ: ఆత్మగౌరవంతో కూడిన పోలీస్ అధికారిగా పవన్ కల్యాణ్, అహంకారంతో రగిలిపోయే వ్యక్తిగా రానా అద్భుతంగా నటించారు.

పవన్ జోడీగా నిత్యా మీనన్ చక్కటి పాత్రలో కనిపించారు. వారి మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

సంయుక్తా మీనన్ ఎమోషనల్ పాత్రలో కనిపించారు. పతాక సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాముఖ్యం ఉంది.

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ.. సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో ఉంది.

దర్శకుడు సాగర్ కె. చంద్ర అందరి నుంచి మంచి అవుట్‌పుట్‌ తీసుకున్నారు.

తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ‘‘లా లా భీమ్లా’’ సాంగ్ తీసిన విధానం బావుంది.

చివరిగా.. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, మాస్ డోస్ ఎక్కువైనట్టు అనిపించవచ్చు. కానీ, ఆకట్టుకుంటుంది.