దేవుళ్లంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు. మరి శివుడెందుకు కనిపించడనే సందేహం వస్తుంది. అయితే శివుడు కూడా సర్వాలంకార భూషితుడే.
ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఓ రూపంలో దేవతలను అనుగ్రహిస్తే,మరో రూపంలో అఘోరాలతో పూజలందుకుంటాడు,ఇంకో రూపంలో యోగులను కరుణిస్తే, నాలుగో రూపంలో కన్నుల పండువగా కనిపిస్తూ మానవాళిని ఉద్ధరిస్తాడు.
తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా ఉండే శివుడిని చూస్తుంటాం. తూర్పుముఖంగా ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట.
దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే.
శివుడంటే లింగరూపమే.....నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే....అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న ముక్కంటికి యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారట.
పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే. ధ్యానంలో ఓసారి, దిగంబరంగా మరోసారి, లింగరూపంలో ఇంకోసారి కనిపించే పరమేశ్వరుడు...గౌరీపతిగా, సర్వాలంకార భూషితుడిగా పూజలందుకుంటాడు. దీన్నే వామదేవం అంటారు.
ఈశాన్యం ముఖంలో కనిపించే పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.
సృష్టి అంతా ఒకటే అని చాటి చెప్పేది శివలింగం. ఆద్యంతం ఒంపుల్లేకుండా ఒకేలా కనిపిస్తుంది.