వండర్స్ ఆఫ్ ఉక్రెయిన్
(ఉక్రెయిన్లో అందమైన ప్రదేశాలివిగో...)



రష్యా బాంబుల ధాటికి ఉక్రెయిన్లోని ఎన్నో అందమైన కట్టడాలు నేలపాలయ్యాయి.

యుధ్ధానికి ముందు ఉక్రెయిన్ ఓ అందమైన దేశం. అందులోని ముఖ్య ఆకర్షణీయ ప్రదేశాలు, కట్టడాలు ఇవిగో...



ల్వివ్... ఇదొక నగరం. అబ్బురపరిచే ఆర్కిటెక్చర్ దీని సొంతం.

ఒడెస్సా నగరంలోని ప్యాస్టెల్ కలర్ కట్టడాలు చూసేందుకు కనులు విందుగా ఉంటాయి.



విరిసిన పొద్దు తిరుగుడు పువ్వులను లక్షలాదిగా చూడాలంటే ఉక్రెయిన్ కు రావాల్సిందే.



స్పై రిసార్ట్ స్కైయర్స్ పాటి స్వర్గధామం. చుట్టూ ఉన్న ఊళ్లు రంగుల హరివిల్లులా కనిపిస్తాయి.

కామినెట్స్ పొడిలిస్కై కోట కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. ఇది 14వ శతాబ్ధానికి చెందినది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఇంద్రధనుస్సులాంటి భవంతులతో నిండి ఉంటుంది. ఇప్పుడిది సమాధుల్లా మారిపోయింది.

ప్రేమికులకు ఈ దేశంలోని ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటే చాలా ఇష్టం. రెండు వైపులా చెట్లతో మూసిన సొరంగంలా ఉంటుందిది.