‘బిగ్ బాస్ నాన్-స్టాప్’ హౌస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భామలతో నిండిపోయింది. బిగ్ బాస్‌లో ఉన్న 9 మంది అమ్మాయిల్లో నలుగురు ఆర్జీవీ భామలే ఉన్నారు. మొదటి సారి బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన శ్రీ రాపాక. ఇప్పుడు ఈమె ఛాలెంజర్స్ టీమ్‌లో ఉంది. ఈమె ‘నగ్నం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అరియానా గ్లోరీ ‘బిగ్ బాస్’ సీజన్ 4 కంటెస్టెంట్. ఈమె కూడా వారియర్స్ టీమ్‌లో ఉంది. ‘బిగ్ బాస్’ సీజన్-4 తర్వాత ఈమె ఆర్జీవీతో ‘బోల్డ్’ ఇంటర్వ్యూ చేసింది. ‘బిగ్ బాస్’ సీజన్-2లో పాల్గొన్న తేజస్వీ మదివాడ.. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో వారియర్స్ టీమ్‌లో ఉంది. తేజస్వీ ఆర్జీవీ చిత్రం ‘ఐస్ క్రీమ్’లో హీరోయిన్‌గా నటించింది. తేజస్వీకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు. అయితే, సోషల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంది. ‘బిగ్ బాస్’ సీజన్-3లో పాల్గొన్న అషూ రెడ్డి ఇప్పుడు ‘నాన్ స్టాప్’లో వారియర్స్ టీమ్‌లో ఉంది. అషు రెడ్డి కూడా ఆర్జీవిని ‘బోల్డ్’గా ఇంటర్వ్యూతోనే పాపులర్ అయ్యింది. అషూ రెడ్డి, అరియానా టీవీ షోస్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. బయట కూడా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్.