యంగ్ హీరోయిన్లలో ఎవరికీ లేనంత క్రేజ్ సాయి పల్లవి సొంతం అయ్యింది. ఆమె లేడీ పవన్ కల్యాణ్ అని దర్శకుడు సుకుమార్ కాంప్లిమెంట్ ఇచ్చారు. సాయి పల్లవి అంటే ఎందుకు అంత క్రేజ్?
సాయి పల్లవిని ప్రేక్షకులు అభిమానించడానికి తొలి కారణం అభినయం. తెలుగులో తొలి సినిమా చేయడానికి ముందే మలయాళ 'ప్రేమమ్' చూసి ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.
కల్మషం లేని మనస్తత్వం. సాయి పల్లవి ఎవరి గురించి చెడుగా మాట్లాడరు.
డ్రస్సింగ్ స్టయిల్. మోడ్రన్ డ్రస్ వేసుకున్నా సాయి పల్లవి హుందాగా ఉండటానికి ప్రాముఖ్యం ఇస్తారు.
సోషల్ మీడియాలో హడావిడి లేకుండా... అరుదుగా పోస్టులు చేయడం వల్ల ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించేవారు ఉన్నారు.
కథలు ఎంపిక చేసుకునే విధానం. మనసుకు నచ్చిన కథలే చేస్తారు. సాయి పల్లవి చేసే కథలు ప్రేక్షకులకూ నచ్చుతున్నాయి.
సాయి పల్లవి ప్రవర్తన. సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడే మాటలు స్ఫూర్తివంతంగా ఉంటాయి.
సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఆమె డ్యాన్స్ చేస్తుంటే... ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే.