ఏటా జులై 28న వరల్డ్ హెపటైటిస్ డే నిర్వహిస్తారు.

కాలేయం వాపునే ‘హెపటైటిస్’ అని అంటారు.

పచ్చ కామెర్ల రూపంలో ఈ వ్యాధి బయటపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే వేపుళ్లు, ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు.

ఆల్కహాల్ అలవాటు సైతం కాలేయాన్ని నాశనం చేస్తుంది.

పుల్లని సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకున్నా కాలేయానికి ముప్పే.

మసాలా ఫుడ్స్ కూడా కాలేయాన్ని దెబ్బ తీస్తాయి.

టీ, కాఫీలు కాలేయంపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి, తక్కువగా తాగండి.



మాంసం పచ్చిగా, ఉడికీ ఉడకనట్లు ఉన్నా కాలేయానికి ప్రమాదమే.

ఇంకా మైదా, ప్యాక్డ్ ఫుడ్స్, పంది మాంసం కూడా ప్రమాదకరమే.

ఈ సూచనలు చేసినవారు: హుదా షేక్ ఖాన్, క్లినికల్ డైటీషియన్, ముంబై.