పురుషుల కంటే మహిళలు ఎక్కువ కలర్స్ చూడగలరా? అది నిజమేనా? చాలామంది అబ్బాయిలు అనుకుంటారు.. అమ్మాయిలది చాలా ‘కలర్‌ఫుల్’ లైఫ్ అని. అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. అయితే, ‘కలర్స్’ను చూడటంలో అమ్మాయిలే బెస్ట్. ఔనండి.. ఇటీవల ఎమిలీ మెక్‌డోనాల్డ్ అనే న్యూరోసైంటిస్ట్ చెప్పిన విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువ రంగులు చూడగలరట. దీనికి X క్రోమోజోములే కారణమట. రంగును గుర్తించడంలో X క్రోమోజోమ్‌లు కీలక పాత్ర వహిస్తాయట. పురుషుల్లో ఒక X, ఒక Y క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. స్త్రీలలో రెండు X క్రోమోజోములు ఉంటాయి. ఎక్కువ X క్రోమోజోమ్స్ ఉండటం వల్ల మహిళలు ఎక్కువ రంగులను చూడగలుతారని ఎమిలీ చెప్పారు. అంటే.. మహిళలు చూసే రంగుల్లో చాలావరకు రంగులను పురుషులు చూడలేకపోవచ్చు. అయితే.. ఆ కలర్స్ ఏమిటీ? బాగా బ్రైట్ కలర్స్ చూడగలరా? లైట్ కలర్సా అనేది ఎమిలీ చెప్పలేదు.