ఎటువైపు తిరిగి నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది?

మీరు నిద్రపోతున్నప్పుడు ఎటు తిరిగి పడుకుంటారు? ఎడమ వైపుకా? కుడి వైపుకా?

మీరు ఎడమ వైపు తిరిగి పడుకుంటే మాత్రం.. మంచి అలవాటే. ఎందుకంటే..

శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపే ముఖ్య భాగం తోరాకిక్ డక్ట్ ఎడమ వైపు ఉంటుంది.

లింఫ్ వ్యవస్థలో అతి పెద్ద అవయవమైన స్ల్పీన్ కూడా శరీరంలో ఎడమ వైపే ఉంటుంది.

లెఫ్ట్ సైడ్‌కు తిరిగి నిద్రపోతే శరీరంలోని వ్యర్థాలు, విషతుల్యాలు బయటికి పోతాయి.

ఎడమ వైపు తిరిగి నిద్రపోతే స్ల్పీన్ చురుగ్గా ఉంటుంది. రక్త సరఫరా మెరుగవుతుంది.

గుండెల్లో మంట అనిపిస్తున్నట్లయితే ఎడమ వైపు తిరిగి పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు

మన శరీరంలో కాలేయం కుడి వైపు ఉంటుంది. అటు తిరిగి పడుకుంటే కాలేయంపై భారం పడుతుంది.

రైట్ సైడ్ తిరిగి పడుకుంటే కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోతాయట.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.