ఆ దేశ ప్రజలు 150 నిమిషాలు నడవాలట, ఎందుకంటే?

రోజూ మీరు ఎన్ని గంటలు నడుస్తారు? అస్సలు నడవడం లేదా?

అయితే, మీకు కూడా ఇలాంటి రూల్ ఒకటి పెట్టాలేమో.

నైజీరియాలో ప్రజలు వారంలో తప్పకుండా 150 నిమిషాలు నడవాలట.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు హెల్త్ ఎమర్జెన్సీ ఇనిషియేటివ్(HEI)గా ఏర్పడి ఈ సూచన చేశాయి.

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో 150 నిమిషాలు నడక తప్పనిసరని సూచించాయి.

దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించాయి.

వాళ్లు మాత్రమే కాదు.. మీరు కూడా ఈ విధానం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు.

Images Credit: Pexels