వామ్మో, ఈ దేశ ప్రజలు కేవలం మాంసమే తింటారట

మనలో చాలామంది నాన్‌వెజ్ అప్పుడప్పుడు, వెజ్ రెగ్యులర్‌గా తింటుంటారు.

మరికొందరికైతే నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. ఆ దేశంలో ప్రజలంతా ఇదే టైపు.

డైలీ వారికి మాంసాహారం ఉండాల్సిందే. లేకపోతే పేచీ పెట్టేస్తారు.

ఇంతకీ ఆ దేశం ఏమిటి అని అనుకుంటున్నారా? మరేదో కాదు అమెరికా.

వరల్డ్ కౌంట్ డేటా ప్రకారం, అత్యధిక మాంసాహారులు కలిగిన దేశంగా నెంబర్ 1 స్థానంలో అమెరికా ఉంది.

అమెరికాలో ప్రతి వ్యక్తి ఏడాదికి సుమారు 124 కిలోల మాంసాన్ని లాగిస్తారట.

అమెరికా తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా నిలిచాయి.

ఆస్ట్రేలియా ప్రజలు ఏడాదికి 122 కిలోలు, అర్జెంటీనా ప్రజలు 109 కిలోల మాంసాన్ని తింటున్నారట.

మరి ఏడాదికి మీరు ఎంత మాంసాన్ని తింటున్నారో ఒకసారి లెక్క వేసుకోండి.

Images Credit: Pixels, Pixabay and AI