స్మోకింగ్ మానేయాలంటే

ఈ ఫుడ్స్​తో స్మోకింగ్​ని కంట్రోల్ చేయొచ్చు తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

డైట్

కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకుంటే స్మోకింగ్ క్రేవింగ్స్ తగ్గుతాయంటున్నారు నిపుణులు. అందుకే వాటిని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు.

ఆకుకూరలు

పాలకూర, తోటకూర కాలే వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ కూడా ఉంటుంది. ఇవి స్మోక్ చేయాలనే కోరికను తగ్గిస్తాయి.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ జాతికి చెందిన వెజిటేబుల్స్, బ్రకోలీ కూడా నికోటిన్ వాడకాన్ని తగ్గిస్తాయి. వీటిలోని సల్ఫోరఫేన్ స్మోకింగ్ ఆలోచనలను తగ్గిస్తుంది.

బెర్రీలు

బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి ఫుడ్స్​లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి. దీనివల్ల పొగ తాగాలనిపించదు.

నట్స్

నట్స్, సీడ్స్​ని డైట్​లో చేర్చుకుంటే చాలా మంచిది. బాదం, సన్​ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిలో మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.

చేపలు

సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఆరోగ్యానికి మంచివి. వీటిలోని ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించి స్మోక్ చేయాలనే కోరికను కంట్రోల్ చేస్తాయి.

చిలగడ దుంపలు

చిలగడ దుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచి స్మోకింగ్ హ్యాబెట్​ని తగ్గిస్తుంది.

అవకాడో

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అడెర్నల్ ఫంక్షన్​కి ఇది సపోర్ట్ చేస్తుంది. దానివల్ల స్మోకింగ్ అలవాటు తగ్గుతుంది.

మల్టీ గ్రైయిన్స్

బ్రౌన్ రైస్, క్వినోవా వంటి మల్టీ గ్రైయిన్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి నికోటిన్ క్రేవింగ్స్​ని తగ్గిస్తుంది.

ప్రోటీన్

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే పప్పులు, శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడిని తగ్గించి హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

సిట్రస్ ఫ్రూట్స్

ఆరెంజ్, ద్రాక్ష వంటి విటమిన్ సి కలిగిన ఫుడ్స్​ నికోటిన్ కోరికలను తగ్గిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్​గా డైట్​లో చేర్చుకోవచ్చు.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. (Image Source : Envato)