తలనొప్పితో రోజును ప్రారంభిస్తే అది మన రోజు మొత్తాన్ని పాడుచేస్తుంది. ఏకాగ్రత ఉండనివ్వదు. శక్తి స్థాయిలపై ప్రభావం ఉంటుంది. రోజు మొదలైనప్పటి నుంచే అలసిపోయినట్లుగా అనిపిస్తుంది.
చాలా మంది ఉదయం తలనొప్పులు అలసట లేదా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మాత్రమే వస్తాయని అనుకుంటారు. కానీ కారణాలు తరచుగా మరింత లోతుగా ఉంటాయి. శారీరక, మానసిక ఆరోగ్య అంశాలు రెండింటినీ కలిగి ఉంటాయి.
ఉదయాన్నే వచ్చే తలనొప్పులకు జీవనశైలి అలవాట్లు, ఒత్తిడి, నిద్ర నాణ్యత సమస్యలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెదడు రాత్రి సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి, మరమ్మత్తు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే నిద్ర తగ్గితే కోలుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఇది తలనొప్పికి దారి తీస్తుంది.
రాత్రి సమయంలో మీకు తెలియకుండానే దంతాలను కొరుకుతుంటే అది దవడ, ముఖ కండరాలలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఉదయం తలనొప్పికి కారణం కావచ్చు.
నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడటం వల్ల మెదడులో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ ఆక్సిజన్ అసమతుల్యత తరచుగా తెల్లవారుజామున తలనొప్పికి కారణమవుతుంది.
అస్థిరమైన నిద్ర షెడ్యూల్ లేదా ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం వల్ల మీ శరీరం సహజ లయకు భంగం కలుగుతుంది. దీనివల్ల తరచుగా ఉదయం తలనొప్పి లేదా అసౌకర్యానికి దారితీస్తుంది.
ఉదయాన్నే రక్తపోటు ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీనివల్ల తలనొప్పి రావచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు లేదా ఆందోళన ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది.