చలికాలంలో ఢిల్లీలో చూడగలిగే ప్రదేశాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/ElysianNan

ఢిల్లీ అందాలు

చలి పెరగడంతో ఢిల్లీలో సూర్యరశ్మి పొగమంచు మంచి అనుభూతి ఇస్తుంది. అందుకే ఇది యాత్రికులను, స్థానికులను ఆకర్షిస్తూ ఉంటుంది.

Image Source: pexels

వారసత్వపు కట్టడాలు

సూర్యరశ్మి, చల్లని గాలులు, ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాల వైభవం కలిసి శీతాకాలంలో నగరాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Image Source: Pinterest/shweghna31

మంచి అనుభవాలు

ప్రశాంతమైన పార్కుల నుంచి.. ఆహార వీధుల వరకు.. ఢిల్లీలో శీతాకాలంలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: Pinterest/alviraa015

ఇండియా గేట్

ఢిల్లీలో తేలికపాటి చల్లగాలులు, సూర్యరశ్మిలో వేడి కాఫీ తాగుతూ ఇండియా గేట్ చూస్తే ఆహ్లాదకరమైన అనుభూతి మీ సొంతమవుతుంది.

Image Source: pexels

లొధి గార్డెన్

లోధి గార్డెన్ శీతాకాలంలో మార్నింగ్ వాకింగ్ చేసేందుకు, పిక్నిక్లు వెళ్లేందుకు అనువైన ప్రశాంతమైన ప్రదేశం ఇది.

Image Source: Pinterest/starrynaitt

హౌజ్ ఖాస్ విలేజ్

హౌజ్ ఖాస్ కోట పాతకాలపు మనోహరమైన ఆకర్షణ, అధునాతనమైన కేఫ్‌లు, సరస్సు ఒడ్డున దృశ్యాలతో కలిసి మంచి అనుభూతి ఇస్తుంది.

Image Source: Pinterest/thjeenamaisies

కుతుబ్ మినార్

ఢిల్లీలో చలికాలంలో చారిత్రక కుతుబ్ మినార్ తప్పక విజిట్ చేయాలి. ఇది సంస్కృతి, ప్రశాంతతను అందిస్తుంది.

Image Source: pexels

ఢిల్లీ హాట్

శీతాకాలంలోఢిల్లీ హాట్ చేనేత పనులకు, మనసుకు హత్తుకునే సంగీతం, నోరూరించే ప్రాంతీయ వంటకాలతో నిండి ఉంటుంది. వారాంతపు సందర్శనకు ఇది సరైనది.

Image Source: Pinterest/md_jewells

ఓల్డ్ ఢిల్లీ

ఢిల్లీలో క్రిస్పీ జలేబీలు, కారంగా ఉండే చోలే భటూరే, చాందినీ చౌక్లోని స్వీట్స్ తప్పక ఆస్వాదించాల్సిందే అంటున్నారు.

Image Source: pexels